- ప్రభుత్వ వైఫల్యాలును ప్రజా వ్యతిరేకతను వరంగల్ సభ వేదికగా ఎండగట్టాలి
ఉప్పల్ – ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజా వ్యతిరేకతను వరంగల్ సభ వేదికగా ఎండగట్టాలి అని ఆయన అన్నారు.27 న పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్బంగా ఉప్పల్ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరేయాలి అని ఆయన కోరారు.రేవంత్ రెడ్డి పాలన పెయిల్ అయింది.. హైడ్రా పేరుతొ పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల గోస పోసుకున్నాడు. మూగ జీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవు అని ఆయన అన్నారు.రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిండు అని ఆయన తెలిపారు.వానకాలం రైతుబందు ఎగొట్టిన డబ్బులు 13 వేల కోట్లు.. రుణమాఫీ చేసింది 14 వేల కోట్లు అంటే రైతుబందు ఎగొట్టి రుణ మాఫీ సగం చేసిండు అని ఆయన అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున రావాలి అని ఆయన కోరారు.