ఏడు పదుల వయసులో గత 487 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఎట్టకేలకు దీక్షను విరమించారు. శుక్రవారం రోజు పంజాబ్ సర్కారు ఇచ్చిన హామీలను అంగీకరిస్తూ నీళ్లు తాగారు. ప్రస్తుతం ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఇంతకాలం పాటు ఆహారం సహా మంచినీళ్లు కూడా ముట్టుకోని ఈయన రైతుల కోసం విపరీతంగా కష్టపడ్డారు. ఎన్నిసార్లు ఆరోగ్యం క్షీణించినా ఏమాత్రం లెక్కచేయలేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

రైతుల డిమాండ్ల సాధన కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కొద్ది నెలలుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆయన తన దీక్షను విరమించుకున్నారు. పంజాబ్ సర్కారు ఇచ్చిన హామీలను అంగీకరిస్తూ శుక్రవారం రోజు మంచినీళ్లు తాగారు. ఈ విషయాన్ని నేరుగా అక్కడి ప్రభుత్వమే తెలిపింది. అయితే 487 రోజుల పాటు ఏమీ తినకుండా, పచ్చి మంచి నీల్లు కూడా ముట్టుకోకుండా ఉన్న దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించగా.. నేడు ఆస్పత్రికి తరలించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. ఏడు పదుల వయసులో రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ – హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద దీక్ష చేపట్టిన ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ రైతు సంఘాల నాయకుల మాత్రం.. ఆయన దీక్షకు భంగం వాటిల్లకుండా గట్టి చర్యలు చేపట్టారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నా ఎలాంటి ఫలితమూ లేకపోయింది.
ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తరచుగా.. రైతు నాయకుడు దల్లేవాల్ దీక్ష విరమించేలా చేయాలని, ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సాయం అందించాలని పదే పదే సూచించాయి. బలవంతంగా నైనా సరే ఆస్పత్రిలో చేర్పించాలని చెప్పాయి. కానీ పంజాబ్ ప్రభుత్వానికి అది ఏమాత్రం వీలు కాలేదు. రైతు సంఘాల నాయకులు, రైతులు కనీసం దల్లేవాల్‌ను చూడను కూడా చూడనివ్వకుండా అడ్డగించారు. ఇదంతా చూసిన దల్లేవాల్… రైతు ప్రతినిధులతో కేంద్రం చర్చలకు అంగీకరిస్తే వైద్య సాయం పొందడం తనకు సమ్మతమేనని ఇటీవలే ప్రకటించారు.