-కెసిఆర్ చేతుల మీదుగా ఎంబీబీఎస్ చెక్కులు అందజేత

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ నియోజకవర్గంలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎంబీబీఎస్ కి అయ్యే ఫీజు మొత్తం చెల్లించడం నిజంగా గొప్ప విషయం అని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు.నంది నగర్ లోని ఆయన నివాసం లో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 15 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా కేసిఆర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బాసట గా నిలవడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే ని కెసిఆర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
