
ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ సర్కిల్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ అధికారులు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ, అలాంటి కట్టడాలను సీజ్ చేయడం, కూల్చివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గురువారం నాడు ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని రామంతపూర్ ఉప్పల్ భగయత్ లోని అనేక అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది రామంతపూర్ డివిజన్ శారద నగర్ లో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ ని సీజ్ చేసిన ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిమిషన్ కు విరుద్ధంగా నిర్మించిన భవన కావడంతో అధికారులు పరిశీలించి సీజ్ చేయడం జరిగినది అదేవిధంగా ఉప్పల్ బగాయత్తులోని పలు అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం జరిగినది ఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఏసిపి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టిపిఎస్ తుల్జా సింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణ బిల్డింగుల ను సీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే ఉప్పల్ భగాయత్ లో అక్రమంగా నిర్మించిన షెడ్లను ఎప్పుడు సీజ్ చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు