ఉప్పల్ – మెడలో నుంచి చైన్ కాజేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్లోని విజయపురి కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి అనే మహిళ సరస్వతి కాలనీలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాలు అమ్ముతుంది. బైక్ పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పాలు కొనుక్కునేలా నటించి మెడలో ఉన్న మూడు తులాల చైన్ లాక్కొని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచర్ చైన్ దొంగిలించే క్రమంలో విజయ లక్ష్మీ అనే మహిళ ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి.
ఉప్పల్ విజయపురి కాలనీలో చైన్ స్నాచింగ్
