
ఉప్పల్ న్యూస్- ఉప్పల్ మున్సిపల్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్, సిటీ న్యూరో సెంటర్ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ స్టేడియంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురికి ఉచితంగా బిపి, సుగర్, లివర్ తదితర పరీక్షలు నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి రఘురాములు, కార్యదర్శి వేముల తిరుపతి రెడ్డి, జాజుల నగేష్ గౌడ్, మాడుగుల మోహన్ రెడ్డి, శాగపురం శ్రీహరి గౌడ్, పెద్దోళ్ల నాగిరెడ్డి, గరిమాజి శ్రీనివాసాచారి, గడ్డం సుబ్బా రెడ్డి, గంటా రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్ శెట్టి, మల్లా రెడ్డి, అన్య బాల కృష్ణా, వెంకటేష్, మేడిపల్లి నవీన్ చారి, పలువురు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. నడకతో పాటు శారీరక వ్యాయామం కూడా ముఖ్యమని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ న్యూరో సెంటర్ సిబ్బంది బి. ఇనాక్, శ్రీజ, దివ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.
