
ఉప్పల్ న్యూస్ – ఉప్పల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి(80) గురువారం నాడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే గెలిచారు. 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పని చేశాడు. 2014లో పోటీ చేయకుండా తన సోదరుడు బండారి లక్ష్మారెడ్డిని పోటీలో నిలిపారు.