ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక..

  • అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిగా వేముల తిరుపతిరెడ్డి,గ్యారంపల్లి శివాజీ

.ఉప్పల్ :ప్రతిష్టాత్మకమైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా వేముల తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పి.సాగర్,ప్రధాన కార్యదర్శిగా గ్యారంపల్లి శివాజీ, ఉపాధ్యక్షులుగా 1. ఏ.వి. శ్రీధర్ రావు, 2. కూకట్ల నరోత్తమ్ రెడ్డి, కోశాధికారిగా గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీగా దాస రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది,ముఖ్య సలహాదారులుగా కొలనుపాక చంద్రమౌళి, దొంతుల వెంకటరామ్ రెడ్డి,కంచు శ్రీను,కోడి కంటి శ్రీనివాస్ వ్యవహరిస్తారు.ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆడ్ హక్ కమిటీ సభ్యులైన వెంకట్రాంరెడ్డి, చంద్రమౌళి,పి. మహేందర్ రెడ్డి లు వ్యవహరించారు. కార్యక్రమంలో రిపోర్టర్స్ ముత్యంరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించిన మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ ఈ కమిటీ 2 సంవత్సరాల వరకు కొనసాగుతుంది అని తెలిపారు.అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం వేముల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ జర్నలిజం విలువలు కాపాడటం, పాత్రికేయుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడతానని అలాగే ప్రెస్ క్లబ్ సభ్యులు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఉప్పల్ ప్రాంతంలోని జర్నలిస్టులను ఒకే వేదికపై ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.ప్రెస్ క్లబ్ ద్వారా సామాజిక బాధ్యత కార్యక్రమాలు చేపట్టడం, యువ జర్నలిస్టులకు మార్గనిర్దేశం చేయడం, అలాగే ప్రభుత్వ అధికారులతో సమన్వయం పెంచడం తమ కార్యాచరణలో భాగమని తిరుపతిరెడ్డి వెల్లడించారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *