ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పౌష్టికాహార కిట్లు పంపిణీ

Oplus_16908288

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీ బి రోగులకు ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ సంస్థ నిక్షయ్ మిత్రాగా నమోదు చేసుకొని వారి సహకారంతో ఈరోజు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ టి.బి డాక్టర్ రాజేశం పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నుండి త్వరగా కోలుకోవచ్చని చెప్పారు అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ మాట్లాడుతూ క్షయ వ్యాధిని నివారించడంలో ముందస్తు వ్యాధి నిర్ధారణ పూర్తి కాలం మందులు వాడటం చాలా ముఖ్యమని తెలియజేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ టిబి డాక్టర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ సంస్థకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇంకా నిశ్చయమిత్ర ద్వారా దాతలు ముందుకు వచ్చి టిబి బారిన పడిన రోగులకు న్యూట్రిషన్ కిట్ల అందించడంలో సహాయం చేయమని కోరారు. ఈ కార్యక్రమంల లో డిప్యూటీ డి ఎంహెచ్ ఓ డాక్టర్ సత్యవతి, పీహెచ్సీ ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్యా , శ్రీ అభిలాష్ స్టేట్ ప్రాజెక్ట్ లీడర్ ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్, శ్రీనివాస్ , వాసు ప్రసాద్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ టీబీ సెల్ బి వెంకటేశ్వర్ రెడ్డి , ఎం పి హెచ్ ఈ ఓ , బోగ ప్రకాష్ హెల్త్ సూపర్వైజర్ , డిస్ట్రిక్ట్ టీవీ స్టాప్ , పీహెచ్సీ ఉప్పల్ ఎస్ టి ఎస్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 6 టిబి యూనిట్ లలో ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ వారు 750 టిబి రోగులకు రెండు నెలలకు సరిపడా 1500 న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అంతట నిర్వహించడం జరిగినదని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *