- పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టుగా ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.1.86 కోట్ల నిధులతో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్టుగా చెప్పారు.ఉప్పల్‌లోని సాయిబాబాకాలనీ నుంచి సూర్యనగర్ కాలనీ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి మరియు కాలనీవాసులతో కలిసి పరిశీలించారు.ఉప్పల్ డివిజన్‌లోని కాలనీవాసులతో పాటు ఇతరులకు సైతం సౌకర్యంగా ఉండే విధంగా బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తయితే మెట్రో క్యాష్ అండ్ క్యారీ నుంచి నేరుగా ఏషియన్ మాల్ వరకు రాకపోకలను సాగించవచ్చన్నారు. ఈ కార్యక్రమం లో సాయిబాబా కాలనీ అధ్యక్షులు లెక్కల అంజి రెడ్డి ,తుమ్మల దేవి రెడ్డి ,సురేష్ ,సుమన్ శర్మ ,రత్నం ,తుమ్మల రాజేందర్ రెడ్డి ,చంద్ర రెడ్డి ,వెంకట్ రెడ్డి ,రమణ రెడ్డి ,లక్ష్మ రెడ్డి ,బిక్షపతి ,అంజయ్య గౌడ్ ,భీమయ్య ,బిక్షం రెడ్డి ,బొమ్మాజి ,నరేందర్ ,నర్సింహా ,నరేష్ గౌడ్ ,ఉపేందర్ ,చింతకింది శ్రీనివాస్ ,గర్దాసు వెంకటేష్ ,నాగునాయక్ ,గణేష్ ,సురేష్ యాదవ్ ,జంగా రెడ్డి ,ప్రమోదా ,పీరంభి ,సుమలత ,సువర్ణ ,బాలమణి ,సిద్ధమ తదితరులు పాల్గొన్నారు