- నేడు, రేపు సిటిజన్ సర్వీస్ సెంటర్లో చెల్లించవచ్చు – డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు
సకాలంలో ఆస్తి పనులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరిం చాలని గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ 2 డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు కోరారు. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతపూర్, ఉప్పల్ డివిజన్ ప్రజలు ఆది, సోమవారం ఉదయం పది నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చని పేర్కొన్నారు. డిడి. చెక్, ఫోన్, గూగుల్ పే ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు మాత్రమే ఉంటాయని, నగదుకు అవకాశం లేదన్నారు. ప్రజలు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంజనేయులు కోరారు.