- ఉప్పల్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ లోని శ్రీ విజయ గణపతి స్వామి దేవస్థానం లో
- డిసెంబర్ 1 నుండి జనవరి 10 వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 2:30 గంటల వరకు అన్న ప్రసాదం (బిక్ష) కార్యక్రమం

ఉప్పల్ న్యూస్ – తత్వమషి అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో ఉప్పల్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ లోని శ్రీ విజయ గణపతి స్వామి దేవస్థానంలో డిసెంబర్ 1 నుంచి జనవరి 10వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు (బిక్ష) అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రెండు గంటల 30 నిమిషాలకు వరకు భిక్ష కార్యక్రమం ఉంటుందని అయ్యప్ప స్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గత ఏడాది ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం స్వయంగా చేయాలనుకున్నవాళ్లు తత్వమసి అయ్యప్ప భక్త సమాజం ను సంప్రదించాలని వారు కోరారు
