- 2 బోర్ వెల్స్ సీజ్ చేసిన రెవిన్యూ అధికారులు
- రూ.80 వేలు జరిమానా

ఉప్పల్ న్యూస్ – ఉప్పల్ పరిధిలో ఎమ్మార్వో అనుమతి లేకుండా బోర్ వెయ్యొద్దు,అనుమతి లేకుండా బోర్లు వేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మార్వో టి. వాణిరెడ్డి మండల ప్రజలకు తెలిపారు.సోమవారం మేడ్చల్- మల్కాజిరి జిల్లా ఉప్పల్ మండల పరిధిలోని బీరప్ప గడ్డ,కొత్తపేటలోని న్యూ మారుతి నగర్ లోని అనుమతి లేకుండా బోరు వేస్తున్న 2 బోర్ వెల్స్ ను ఉప్పల్ ఎమ్మార్వో టి,వాణిరెడ్డి,డిప్యూటీ తాసిల్దార్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఉప్పల్ ఆర్,ఐలు ఎం,అశ్విని గౌడ్,పి,సామ్సన్ పాల్, జూనియర్ అసిస్టెంట్లు ఎం, అలివేలు,పి,వెంకన్న,లక్ష్మిలు సీజ్ చేశారు,అనంతరం రూ.80 వేలు జరిమానా వేశారు, ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… అనుమతి తీసుకొని బోర్ వేసుకోవాలని వారు సూచించారు,అనుమతి లేకుండా బోర్ వేస్తే కఠిన చర్యలు తప్పవు అని వారు హెచ్చరించారు,