అంగన్ వాడి కేంద్రంలో ఘనంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు

  • విద్యార్థులకు ప్లేట్లు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్

ఉప్పల్, ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ రామంతాపూర్ పూర్ చర్చి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవి కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. అంగన్వాడీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గడ్డం రవి కుమార్ ప్లేట్లు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమా అంతర్జాతీయంగా సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు.. మునుముందు ఇలాంటి సక్సెస్ లో ఎన్నో అందుకోవాలని కోరుకున్నారు. అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానులు సాయి, దేవేంద్ర చౌదరి, నవీన్, మనోహర్, శివ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *